కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన ఆశ (25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి కర్ణాటకలోని చిన్న ఓబనహళ్లి గ్రామానికి చెందిన ఆశతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వన్నూరుస్వామి మంగవారం రాత్రి మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆశ ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటి బయట నిద్రించిన వన్నూరుస్వామి బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement