జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

పుట్టపర్తి టౌన్‌: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) ముందుండి పరిష్కారానికి కృషి చేస్తుందని ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు తెలిపారు. బుధవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా రంగప్ప, అధ్యక్షుడిగా చలపతి, ప్రధాన కార్యదర్శిగా టీసీ గంగాధర్‌, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా బసప్ప, వెంకటేష్‌, కల్లూరి ప్రసాద్‌, కోశాధికారిగా శ్రీరాములు, కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, గంగాధర్‌ అనార్‌, మోహన్‌నాయుడు, నారాయణస్వామిని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్‌ విభాగం అధ్యక్షుడిగా సాయికుమార్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా కేశప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్ట్‌లకు అండగా ఉంటామన్నారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించామన్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్ట్‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షఫీవుల్లా, నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌.కె సూర్య, సంతోష్‌రెడ్డి, దివిటి రాజేష్‌, శివరామకృష్ణ, చక్రపాణి, బాబ్జాన్‌, కేశవ తదితరులు పాల్గొన్నారు.

ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement