కనీస సౌకర్యాలు కరువు | - | Sakshi
Sakshi News home page

కనీస సౌకర్యాలు కరువు

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

మాది అనంతపురం రెండురోజుల క్రితం కుటుంబంతో కలిసి స్వామి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడి సిబ్బంది తీరుతో పడరానిపాట్లు పడ్డాను. ఆలయంలో సరైన వసతులు లేవు. చివరకు మహిళలు స్నానం చేసేందుకు కూడా సరైన వసతి లేదు. గుడి ముందే మురుగు నీరు నిలిచి ఉంది. సెక్యూరిటీ సిబ్బందికి డబ్బులిస్తే వెంటనే దర్శనం చేయిస్తున్నారు. లడ్డూలు అధిక ధరకు విక్రయిస్తున్నారు.

– సాయికృష్ణ, అనంతపురం

అభిషేకం నీళ్ల ప్యాకెట్‌ రూ.100

సామాన్య భక్తులకు ఖాద్రీశుని దర్శనం గగనంగా మారుతోంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో గంటలకు గంటల సమయం పడుతోంది. సెక్యూరిటీ మాత్రం వారికి రూ.500 ఇచ్చిన వారిని అడ్డదారిలో తీసుకువెళ్లి దర్శనం చేయిస్తున్నారు. స్వామివారి అభిషేకం నీళ్ల ప్యాకెట్‌ రూ.100 దాకా అమ్ముతున్నారు. వీటిపై ఆలయ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– హరిత, తవలంమర్రి, నల్లచెరువు మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement