ఉత్కంఠగా హాకీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా హాకీ పోటీలు

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 16వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సీనియర్‌ పురుషుల హాకీ చాంపియన్‌ షిప్‌ టోర్నీలో మూడోరోజైన ఆదివారం పోటీలు ఉత్కంఠగా సాగాయి. మొదటి క్వార్టర్‌ ఫైనల్స్‌లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 1–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో ఎన్టీఆర్‌ జిల్లా జట్టుపై అనకాపల్లి జట్టు 2–0 గోల్స్‌ తేడాతో, మూడో క్వార్టర్‌ ఫైనల్‌లో గుంటూరు జిల్లా జట్టుపై అన్నమయ్య జిల్లా జట్టు 3–0 గోల్స్‌ తేడాతో జయకేతనం ఎగురవేశాయి. హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు చాణుక్యరాజు, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్‌, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, గౌరిప్రసాద్‌, ఉడుముల రామచంద్ర, ట్రెజరర్‌ అంజన్న, జిల్లా హాకీ కోచ్‌ హస్సేన్‌, సహాయ కార్యదర్శి అరవింద్‌ గౌడ్‌, చంద్రశేఖర్‌, మారుతి, అమునుద్దిన్‌, కిరణ్‌లు హాకీ పోటీలను పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement