
వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము నాలుగు రోజులుగా జిల్లాలోని పలు వసతి గృహాలను సందర్శించామన్నారు. ఏ వసతి గృహానికి వెళ్లినా సమస్యలే కనిపించాయన్నారు. మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వసతి గృహాల్లో తాము గుర్తించిన సమస్యలను వివరించి... పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఇవ్వాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాలని, మోనూ ప్రకారం భోజనం అందించాలని, పరుపులు, ప్లేట్లు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందివ్వాలని కోరామన్నారు. అలాగే విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కీలకమైన వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కదిరి రూరల్ అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు మానేరు నరసింహులు, పవన్ కుమార్‌రెడ్డి, కౌశిక్ మేఘనాథ్ అనిల్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను టీఎస్ చేతన్‌నుకోరిన
వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు