
కలెక్టరేట్ వద్ద ఆందోళనలపై నిషేధం
పుట్టపర్తి టౌన్: కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు నిషిద్ధమని ఎస్పీ రత్న స్పష్టం చేశారు. ఇక నుంచి ఆందోళనలు ఆర్డీఓ కార్యాలయాల వద్ద మాత్రమే చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ సమీపంలో సత్యసాయి విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో పాటు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆందోళనల కారణంగా ఇబ్బందులు తలెత్తరాదని ఈ మార్గంలో నిషేధాజ్ఞలు విధించినట్లు వెల్లడించారు. ప్రతి సోమవారం సమస్యలు విన్నవించుకొనేందుకు కలెక్టరేట్‌కు వస్తుంటారని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందు కోసం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాసంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు గమనించి సహకరించాలని కోరారు. అలా కాదని 30 యాక్ట్ అమలులో ఉండే కలెక్టరేట్ వద్ద ధర్నాలకు దిగితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారవుతారని హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు చలో కలెక్టరేట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, పోలీసుల అనుమతులు కోరి తిరస్కరణకు గురయ్యారని పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
న్యూస్‌రీల్