2,98,535 | - | Sakshi
Sakshi News home page

2,98,535

Jul 29 2025 4:42 AM | Updated on Jul 29 2025 4:42 AM

2,98,

2,98,535

ప్రతి ఒక్కరూ పుత్తడికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆర్థికంగా బలవంతులైన వారు హోదాగా భావిస్తే.. సామాన్యులు బంగారాన్ని ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. తమ వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని ధరించినప్పుడు సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, కూటమి సర్కారు పుణ్యమా అని ఆర్థికంగా కుదేలైన అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారాన్ని కుదువ పెడుతున్నారు. కాసింత ఆర్థిక చేయూత కూడా కరువైన దైన్యంలో పుత్తడిని తీసుకుని బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.
రూ.1,879.29కోట్లు
శ్రీ సత్యసాయి జిల్లాలో రైతు భరోసా లబ్ధిదారులు
2,79,556
రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్ము
రూ.1,767.09కోట్లు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అదిగోఇదిగో అంటూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందించకుండా దాటవేస్తోంది. దీంతో పంటల సాగుకు అన్న దాతలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో కుదువ పెడుతున్నారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో నగలు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడం పరిపాటి. కానీ ఈ ఏడాది ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సాయమూ దక్కకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నగలు తాకట్టు పెట్టి అప్పు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ ఉదయం నుంచే నగల తాకట్టుకు రైతులు క్యూ కడుతున్న దుస్థితి నెలకొంది. గతంలో మండలకేంద్రాల్లోని బ్యాంకుల్లో రోజూ పది దాకా దరఖాస్తులు వచ్చేవి. ఇటీవల 40 నుంచి 50 మంది వరకూ కుదువ పెట్టి రుణం తీసుకుంటున్నారు.

సగటున రోజుకు 4 వేల మందికి పైగా

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులకు బంగారు రుణాలు ఇచ్చే బ్యాంకుల బ్రాంచ్‌లు రమారమి 229 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో రోజుకు 4 వేల మందికి పైగా రైతులు రుణాలు తీసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అనుకున్నా రోజుకు రూ.20 కోట్లపైన ఇస్తున్నట్టు అంచనా. నెలలో 20 రోజుల పాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బంగారం కుదువతో ఇప్పటివరకూ రూ.400 కోట్లకు పైగా బ్యాంకులు రుణాలిచ్చాయి. గతేడాదితో పోలిస్తే 22 శాతం పైగా బంగారు లోన్లు పెరిగినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు.

వివాహాల సీజన్‌ అయినా విధిలేక...

ఇటీవల శ్రావణ మాసం మొదలైంది. ఈ క్రమంలో జిల్లాలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి అంటే బంగారు నగలు ఎంత అవసరమో తెలిసిందే. పైగా సెంటిమెంటుతో ముడిపడింది. అయినా సరే నగలు తాకట్టు పెట్టి పంటల కోసం అప్పు తీసు కోవడం రైతుల దీనస్థితికి అద్దం పడుతోంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు ఆర్థిక భరోసా లేకపోవడం వెరసి అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గత సర్కారు హయాంలో

రైతు సాయం ఇలా...

అనంతపురం జిల్లాలో

రైతు భరోసా లబ్ధిదారులు

గుండె బరువు.. బంగారమే ఆదరువు

‘కూటమి’ ఆర్థిక సాయం కరువై

అన్నదాత అగచాట్లు

పెట్టుబడి సాయం అందక

బ్యాంకుల్లో బంగారం కుదువ

గడిచిన ఏడాదితో పోలిస్తే

భారీగా గోల్డ్‌ లోన్లు

వివాహాల సీజన్‌ అయినా

రైతులకు విధిలేని పరిస్థితి

బంగారు తాకట్టు పెట్టి పంట సాగు చేశా

నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఏడాది వేరుశనగ పంట సాగు చేశా. నాకు ఇంత వరకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం బంగారు ఆభరణాలను రత్నగిరి ఆంధ్ర ప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నా. పంట సాగుకు దాదాపు రూ.35 వేల వరకు ఖర్చు పెట్టా.

– బడప్ప,ఆర్‌ గొల్లహట్టి,రొళ్ల మండలం

పెట్టుబడులకు అప్పు చేశా

పంట పెట్టుబడుల కోసం చేతిలో డబ్బులు లేవు. ప్రభుత్వం ఇస్తానన్న సాయం కూడా ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరుల వద్ద అప్పు చేసి పంట సాగు చేశా. ఆరు ఎకరాల్లో కంది వేశా. దుక్కులకు, విత్తనాలకు ఇప్పటికే రూ.10 వేల దాకా ఖర్చయ్యింది. గత ఏడాది కూడా బంగారం తాకట్టు పెట్టి పంటలు సాగు చేశా. దిగుబడి చేతికందక బంగారు రుణం నేటికీ తీరలేదు. ఈసారి ఏమవుతుందో..?

– మాధవయ్య, రైతు, చిగిచెర్ల

2,98,5351
1/4

2,98,535

2,98,5352
2/4

2,98,535

2,98,5353
3/4

2,98,535

2,98,5354
4/4

2,98,535

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement