
హామీలను మాఫీ చేశారు
డ్వాక్రా రుణాల మాఫీ, రైతుల రుణాల మాఫీ అని గతంలో చంద్రబాబు చెప్పి ఏకంగా ఆ హామీలన్నింటినీ మాఫీ చేశారు. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు మాటలు నమ్మి మహిళలంతా ఆయనకు ఓట్లేసి మరోసారి మోసపోయారు. ఎన్నికల సమయంలో మహిళలు కనబడగానే నీకు 18 వేలు.. నీకు 18 వేలు అన్నారు... ఇప్పుడు దాని గురించి మాట్లాడేవారే లేరు. ఇచ్చిన మాట మీద నిలబడటం జగనన్నకే సాధ్యం.
– విజయలక్ష్మి, బూడిదగడ్డపల్లి,
గోరంట్ల మండలం
మోసం.. ఆయన నైజం
ప్రజల్ని మోసగించడంలో చంద్రబాబును మించిన వారు లేరు. మోసం చేయడం ఆయన నైజం. సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చానంటున్నారు. మరి ఆడబిడ్డ నిధి ఏదీ? ఇంకా చాలా హామీలున్నాయి. ప్రజల తరఫున హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే ప్రజల పక్షాన పోరాటాలకు కూడా సిద్ధమవుతాం.
– ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు,
వైఎస్సార్‌సీపీ

హామీలను మాఫీ చేశారు