కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ దుర్మార్గం

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బీవీ రమణయ్య

చిట్టమూరు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ అరెస్ట్‌ దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బీవీ రమణయ్య అన్నారు. చిట్టమూరులో పార్టీ బీసీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ నాయకుల ఎదుగుదలను అధికార టీడీపీ సహించలేక పోతోందన్నారు. సునీల్‌ భవిష్యత్‌ను అణగ దొక్కేందుకు అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు. అక్రమ రవాణా కేసు పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ అరాచకాలను గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కార్యక్రమంలో పట్టివానిపల్లి మాజీ సర్పంచ్‌ పిట్టి ప్రవీణ్‌, వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు కృష్ణమూర్తి, శోభన్‌, సురేష్‌, అక్కెం మునెయ్య, బద్ధిగ శ్రీనివాసులు, వినోద్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement