రిట్‌ పిటిషన్‌ దాఖలు | - | Sakshi
Sakshi News home page

రిట్‌ పిటిషన్‌ దాఖలు

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

తాజా విభజన మేరకు డివిజన్ల సరిహద్దులను సైతం అధికారుల చెప్పలేకపోతున్నారు.

గాంధీగిరిజన కాలనీ, ఎన్టీఆర్‌నగర్‌, వైకుంఠపురం గిరిజనకాలనీ, చింతారెడ్డిపాళెం, రాయపు దళితవాడ, కపాడిపాళెం, జెండావీధి, రంగనాయకులపేట, బుజబుజనెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన డివిజన్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఓటర్లను ఇతర డివిజన్లలో చేర్చారు.

43వ డివిజన్‌ జెండావీధిలోని ముస్లిం ఓట్లను 44, 46, 38వ డివిజన్లో కలిపారు.

పెన్నానదికి అవతలివైపునున్న 51వ డివిజన్‌ ప్రాంతాన్ని నదికి ఇవతలివైపు ఉన్న ప్రాంతంలో కలిపారు.

13వ డివిజన్‌ ప్రాంతాన్ని 16వ డివిజన్లో కలపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ విజయానికి ఆస్కారం లేని డివిజన్లన్నింటినీ చెల్లాచెదురు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు గెలిచే చోట పెద్ద సంఖ్యలో వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరిగిందనే ప్రచారం సాగుతోంది.

టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఎన్నిక ఏదైనా విజయమే పరమావధిగా చేయని కుట్రల్లేవు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రశ్నించే వారిని నిర్బంధించడం.. ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ఎవరైనా లొంగకపోతే వారిని నయనో.. భయానో లొంగదీసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ కోవలోనే నెల్లూరు నగరపాలక సంస్థను తమ హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో డివిజన్లను అడ్డగోలుగా విభజించేందుకు రంగం సిద్ధంగా చేసింది. జనగణన ప్రస్తుతం సాగుతున్న తరుణంలో ఈ ఒంటెత్తు పోకడలను అవలంబించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి.. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ క్రమంలో ప్రక్రియపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఊహించని ఈ పరిణామంతో సైకిల్‌ పార్టీ, జనసేన నేతలు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు.

నెల్లూరు(బారకాసు): నిబంధనల మేరకు పునర్వి భజన ప్రక్రియ జరిగితే స్థానిక ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన కూటమి నేతలు సరికొత్త కుట్రలకు తెరదీశారు. రూల్స్‌ను గాలికొదిలి అధికారులతో కలిసి అడ్డగోలు విభజనకు శ్రీకారం చుట్టారు. సరిహద్దులను చెరిపేసి.. డివిజన్లను చెల్లాచెదురు చేశారు. పారదర్శకత పూర్తిగా లోపించింది.

అభ్యంతరాలు పెడచెవిన

నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అశాసీ్త్రయంగా సాగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టును నగర ప్రజలతో పాటు 13వ డివిజన్‌ కార్పొరేటర్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆశ్రయించారు. ఈ తరుణంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. పునర్విభజన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో అడ్డదారిలో విజయం సాధించాలనే టీడీపీ, జనసేన కుట్రలు బెడిసికొట్టాయి.

54 నుంచి 72కు..

వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి. వీటిని 72కు పెంచుతూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు పునర్విభజన చేయాలని ఆదేశాలిచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మార్చేలా కూటమి నేతలు ప్లాన్‌ చేశారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో.. నిబంధనలను కార్పొరేషన్‌ అధికారులు ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 డివిజన్ల నుంచి 250 అభ్యంతరాలొచ్చాయంటే ఆఫీసర్లు ఎలా వ్యవహరించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో 13, 51, 43, 26వ డివిజన్లలోనూ స్థానికులు, కార్పొరేటర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఓటమి తప్పదనే ఇలా..

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయింది. హామీల విస్మరణ.. దిగజారిన శాంతిభద్రతలు.. నిరుద్యో గం.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ఎన్నో కారణాలతో సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతో కుట్రలకు పచ్చ నేతలు తెరదీశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియను అడ్డం పెట్టుకొని అడ్డదారిలో విజయం సాధించేందుకు ప్లాన్‌ చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో కొన్ని నిబంధనలను విధించారు. అయితే వీటన్నింటినీ ఉల్లంఘించి అస్తవ్యస్త విభజనకు నిర్ణయించారు.

నగరపాలక సంస్థలో అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజన

గెలుపే లక్ష్యంగా టీడీపీ కుతంత్రాలు

నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్పులు, చేర్పులు

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన

వైఎస్సార్సీపీ

డీలిమిటేషన్‌ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

నైరాశ్యంలో టీడీపీ, జనసేన

నెల్లూరు నగరపాలక సంస్థలో అధికార పార్టీ చేపట్టిన పునర్విభజన ప్రక్రియపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను 13వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జున దాఖలు చేశారు. 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, ఇది పూర్తికాక ముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జనగణన నిబంధనల మేరకు 2025 డిసెంబర్‌ 31లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్‌ 1 వరకు మొత్తం ప్రక్రియను ఫ్రీజ్‌ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాల్టీ లు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందని పేర్కొన్నారు. అయినా నిబంధనలను ఉల్లంఘిస్తూ డివిజన్ల పునర్వభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో డీలిమిటేషన్‌ ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది.

సరిహద్దులా.. మేము చెప్పలేము..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement