చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లిలో గల పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వీరాంజనేయ ఫర్టిలైజర్స్ దుకాణంలో రూ.12,89,847 విలువజేసే యూరియా, డీఏపీ ఇతర కాంప్లెక్స్ ఎరువులను నిల్వ చేశారని గుర్తించారు. అనంతరం దుకాణాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సుభానీ, వ్యవసాయ శాఖ నిఘా విభాగాధికారి వేణుగోపాల్, చేజర్ల వ్యవసాయాధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.


