వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

నెల్లూరు(వేదాయపాళెం): వసతి గృహ విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌ షరీఫ్‌ అన్నారు. నెల్లూరులోని సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయం బుధవారం నేతలు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్‌ అంకయ్యకు వినతిపత్రం సమర్పించారు. శివంవర్మ, సోహెల్‌, ఖాదర్‌బాషా, మౌళి, అశోక్‌, రమేష్‌, కుమార్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement