విభిన్న ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

నెల్లూరు(టౌన్‌): జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ తెలిపారు. ప్రత్యేక అవసరాల గల 394 మంది పిల్లలకు రూ.22.14 లక్షల విలువ చేసే సహాయక పరికరాలను నెల్లూరులోని ఏన్జీఓ హోంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2025 – 26 విద్యా సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ద్వారా ఎస్కార్ట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌, బాలికల స్టై ఫండ్‌, బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ కలిపి రూ.71.82 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో సీడబ్ల్యూసీఎన్‌ విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు హియరింగ్‌ పరికరాలు, టీఎల్‌ఎం, బ్రెయిల్‌ కిట్లు, వీల్‌చైర్లు, ట్రై సైకిళ్లు తదితర వాటిని అందజేసినట్లు చెప్పారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 6 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, కావలి, వింజమూరు, గూడూరు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. వాటి ద్వారా పిల్లలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేట్‌ బొబ్బల శ్రీనివాస యాదవ్‌, ఏఎంఓ సుధీర్‌బాబు, ఐఈ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌రావు, ఎంఈఓ మురళి, అలింకో ప్రతినిధి సోని యాదవ్‌, సెక్టోరియల్‌ అధికారులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement