● అడ్డుకునేందుకు
ఇరిగేషన్ అధికారుల యత్నం
● వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు
వెంకటాచలం: మండల కేంద్రమైన వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు టీడీపీ నేతలు తెరలేపారు. పలువురు నాయకులు బుధవారం పోటాపోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీనిపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అడ్డుకునేందుకు కనుపూరు చెరువు వద్దకు వెళ్లగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అయితే అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో తవ్వకాలను నిలిపివేసి జేసీబీ, ట్రాక్టర్లను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.


