విడవలూరు: మండలంలోని రామతీర్థం బీచ్‌లో మంగళవారం సామూహిక యోగా కార్యక్రమం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు స్వయంగా యోగా సనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా సంజీవని లాంటిదన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి నిత్యం యోగా సాధన చేయాలని కోరారు. యోగాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆరోగ్య చైతన్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిచారు. ప్రముఖ యోగా గురువు డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఈ యోగాసనాల ప్రదర్శన సాగింది. యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యతను, అవి మానవ శరీరానికి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలను ఆమె వివరిస్తూ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏ లక్ష్మీప్రసన్న, ఎంపీడీఓ టి.నగేష్‌కుమారి, ఆయూష్, పర్యాటక, ఆరోగ్య, మత్స్య శాఖల అఽధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా సాధకులు పాల్గొన్నారు.


