ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. మూడు నెలల కాలానికి గానూ ప్రధాన హుండీ ద్వారా రూ.5,93,784.. అన్నదాన హుండీ ద్వారా రూ.28,363 మొత్తం లభించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి రూ.53,330 మేర పెరిగిందని ఆలయాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా దేవస్థానం కృషి చేస్తోందని వెల్లడించారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నామని పేర్కొన్నారు. కోవూరు గ్రూప్ దేవస్థానాల ఈఓ కృష్ణప్రసాద్, ఈఓ తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


