సామాన్యులపై పచ్చనేతల జులుం | - | Sakshi
Sakshi News home page

సామాన్యులపై పచ్చనేతల జులుం

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వాకాడు: గ్రామీణ ప్రాంతాల్లో మాట వినని సామాన్యులపై పచ్చనేతలు జులం ప్రదర్శిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన వాకాడులోని తన నివాసంలో ఆదివారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను తుంగలో తొక్కి స్వప్రయోజనాల కోసం అరాచకాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. ఎక్కడ చూసినా కూటమి నేతలు గ్రావెల్‌, ఇసుక దందాలతో తమకు అడ్డేలేదని విర్రవీగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అటకెక్కించిందని విమర్శించారు. సూపర్‌సిక్స్‌ అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. వ్యవసాయం దండగన్న బాబు తాజాగా యూరియా యాప్‌లతో కొరత సృష్టించి రైతు ద్రోహిగా మిగిలారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, నిజాలు తెలుసుకోకుండా అరెస్టులు చేస్తున్న పోలీస్‌ శాఖపై మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement