ఆ సైకోలపై కేసు నమోదు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆ సైకోలపై కేసు నమోదు చేయండి

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి: ‘కావలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కొంతమంది సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన నేతలతో కలిసి కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సుమన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ సోషల్‌ మీడియా ముసుగులో చిలకపాటి మధు, చిలకపాటి మనోహర్‌, మధు కిశోర్‌, తోకల శ్రీను, గొర్రెపాటి హరీష్‌ తదితరులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్నారు. హద్దులు దాటి ప్రవర్తించడం వారి నైజమన్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోయి అధికారులను, ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేయడమే వారి పని అన్నారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్యాయాలు, అక్రమాలను పక్కదోవ పట్టించేందుకు ఇలా చేయిస్తున్నట్లు విమర్శించారు. ఆర్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలపై బురద చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో గ్రావెల్‌, ఇసుక అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, వీటిని ప్రశ్నించేవారిపై సోషల్‌ మీడియా వేదికగా దాడిచేయడంతోపాటు వ్యక్తిగతంగా బెదిరించడం జరుగుతోందన్నారు. కొన్నిరోజుల క్రితం తాను మాట్లాడకపోయినా కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఆగమేఘాలపైన కేసు నమోదు చేయడమే కాకుండా నోటీసులు అందజేశారన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వారం రోజుల్లో వారిపై చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయు లు, పందిటి కామరాజు, ద్రోణాదుల వెంకట్రావు, కుందుర్తి శ్రీనివాసులు, కుందుర్తి కామయ్య, నాగేశ్వరమ్మ, ఇరుముడి వెంకటేశ్వరరెడ్డి, పరుసు మాల్యాద్రి, కనమర్లపూడి వెంకటనారాయణ, ఆర్‌కే కృష్ణారెడ్డి, గుడ్లూరు మాల్యాద్రి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement