● ముగ్గురికి గాయాలు
ఉదయగిరి: ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పామూరు నుంచి ఉదయగిరి, కడప మీదుగా బెంగళూరుకు శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. చింతామణి సిగ్నల్ సమీపంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ సమయంలో 23 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో వరికుంటపాడు మండలం కృష్ణాగాంధీపురానికి చెందిన చిన్న కేశవులు, పెద్దిరెడ్డిపల్లికి చెందిన యోబు, ఉదయగిరి మండంల వెంట్రావుపల్లికు చెందిన సునీల్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌పీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు బాధితులను ఫోన్‌లో పరామర్శించారు.


