అన్నదాత ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆక్రందన

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

గత ప్రభుత్వంలో అన్నదాతకు ధీమా

నెల్లూరు (వేదాయపాళెం): ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే అన్నదాతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలను విధిస్తూ రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గి ఆదాయ వనరులపై వ్యతిరేక పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు, వ్యవసా య, పర్యావరణ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తు న్నారు. అయినా జిల్లా రైతాంగం తమకున్న పొ లాల్లో సాగుచేసేందుకు ఉపక్రమిస్తున్నా, ప్ర భు త్వం దగాకోరు చర్యలను అవలంబిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కర్షకులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

ఓటీపీ వస్తేనే యూరియా అంట..!

వివిధ పథకాల్లో అర్హులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే కోవలో అన్నదాతను వంచించేందుకు స్కెచ్‌ వేస్తోంది. వీరికందాల్సిన మూడు బస్తాల యూరియాను ఇచ్చేందుకూ కొర్రీలు పెడుతోంది. ఇందులో భాగంగా ఏపీఏఐఎమ్మెస్‌ యాప్‌ను రూపొందించింది. దీన్ని తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని.. సంబంధిత అధికారి కార్యాలయంలో లాగినవ్వాలని హుకుం జారీ చేసింది. అయితే సమస్యలు ఇక్కడితో తీరిపోతాయనుకుంటే పొరపాటే. యారియా కోసమో లేక మరే ఇతర అవసరానికో సంబంధిత ఆర్‌ఎస్‌కే, సొసైటీ కార్యాలయానికెళ్లినప్పుడు తమ ఫోన్లను వెంట తీసుకెళ్లి.. సంబంధిత సిబ్బందికి ఓటీపీ చెప్పాలనే విచిత్ర ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవానికి మొబైల్‌ ఫోన్లు లేని వారు.. ఉన్నా వాటిపై పరిజ్ఞానం లేని రైతులు కోకొల్లలు. పొలం తమ పేరుపై ఉన్న వృద్ధుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. సంబంధిత పత్రాలు, ఫోన్‌ను తమ వెంట తీసుకొని మండుటెండల్లో ఆయా కార్యాలయాల చుట్టూ తిరగలేక విసిగి వేసారిపోతున్నారు.

భారీ స్థాయిలో కోత

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన యారియా సరఫరాలో ఈ ఏడాది ప్రభుత్వం భారీ స్థాయిలో కోత విధించిందని తెలుస్తొంది. జిల్లా వ్యాప్తంగా 80 వేల మెట్రిక్‌ టన్నుల మేర అవసరం కాగా, ఇప్పటి వరకు 30 వేల టన్నులనే పంపి చేతులు దులుపుకొంది. అయితే క్షేత్రస్థాయిలో ఇదీ సక్రమంగా అందడంలేదని తెలుస్తోంది. సర్కార్‌ తీరుపై అన్నదాతలు భగ్గుమంటున్నారు.

జిల్లాలో ఇలా..

అవసరమైన యూరియా

16 లక్షల బస్తాలు

వరినాట్లు

4 లక్షల

ఎకరాల్లో..

గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా భరోసా లభించింది. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంట బీమా, కొనుగోలు, మార్కెటింగ్‌ తదితర ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా.. పార్టీలకతీతంగా అన్ని పథకాలు తమకు అందేవనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సింగిల్‌ విండో విధానంలో అవసరమైన అన్ని ప్రయాజనాలు రైతు భరోసా కేంద్రాల్లో నే లభించేవని, అయితే ప్రస్తుతం ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదని పేర్కొంటున్నారు.

అవసరానికి మించి అందుబాటులో..

జిల్లాలో ఈ ఖరీఫ్‌కు 49 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 30 వేల మెట్రిక్‌ టన్నుల మేర దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నాం. మరో 21 వేల మెట్రిక్‌ టన్నులు త్వరలోనే రానున్నాయి. జిల్లాలో ఎక్కడా కొరత లేదు. అర్హులైన రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. యాప్‌ రిజిస్ట్రేషన్‌ అనేది నిరంతర ప్రక్రియ. అవగాహన లేని కర్షకులు తమ సిబ్బందిని సంప్రదిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారిణి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement