పేకాట స్థావరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

అనుమసముద్రంపేట: ఏఎస్‌పేట గ్రామ శివారు పంటచేల వద్ద పేకాట స్థావరంపై ఎస్సై జిలానీ శనివారం దాడులు నిర్వహించారు. ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,640ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

గల్లంతైన వ్యక్తి మృతి

చేజర్ల: కండలేరు జలాశయంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైన వ్యక్తి మరణించారు. పోలీసులు జాలర్ల సాయంతో శనివారం మృతదేహాన్ని వెలికితీశారు. కొల్లపనాయుడు పల్లి అరుంధతీయవాడకు చెందిన కొమ్మల శివకోటయ్య(30) శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన ఘటన తెలిసిందే. గ్రామస్తుల సమాచారంతో శుక్రవారం చేజర్ల పోలీసులు జలాశయంలో శివకోటయ్య కోసం గాలించగా సాయంత్రం వర్షం ఆటంకం కలిగించి చీకటి పడటంతో వెతకడం నిలిపివేశారు. శనివారం ఉదయం పోలీసులు ఆధ్వర్యంలో జాలర్లు ఇసురు వలల సహాయంతో శివకోటయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement