చిల్లకూరు: సీఎం చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్ర వర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీని నిర్వహించి.. ఆర్డీఓ అరుణకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడారు. ఇచ్చిన హామీలే కాకుండా మరిన్ని పథకాలను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. తొలుత టీడీపీ హామీ ప్రతులను దహనం చేశారు.


