అన్ని వర్గాలను మోసం చేశారు | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను మోసం చేశారు

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

కావలి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని, అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల అరాచక పాలనకు నిరసనగా కావలిలో భారీ బైక్‌ ర్యాలీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామిరెడ్డి నేతృత్వంలో తన ఇంటి నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌ వరకు ర్యాలీని పార్టీ శ్రేణులు చేపట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement