ప్రజలకు నయవంచన | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు నయవంచన

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

ఆత్మకూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని, సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ఈ రెండేళ్లలో ప్రజలను ఆయన వంచించారని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మున్సిపల్‌ బస్టాండ్‌ నుంచి ఆర్టీసీ డిపో వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక.. యూరియా కొరత.. తదితర సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement