నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క హామీని సైతం నెరవేర్చలేదని, రానున్న రోజుల్లో వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నగరంలోని కరెంటాఫీస్ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. బాబు మోసాలపై నినాదాలు చేశారు. సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. మోసాల బాబు.. డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


