హమ్మయ్య.. వాన కురిసింది | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. వాన కురిసింది

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

జిల్లా వ్యాప్తంగా వర్షం

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. మధ్యాహ్నం వరకు నెల్లూరులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 3 గంటల తర్వాత మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. 4 గంటల ప్రాంతంలో పలు మండలాల్లో ఈదురుగాలులు వీచాయి. కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, సంగం, పొదలకూరు, వెంకటాచలం, కోవూరు, నెల్లూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, వివిధ మండలాల్లో మంచి వాన పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement