కండలేరు డ్యామ్‌లో వ్యక్తి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కండలేరు డ్యామ్‌లో వ్యక్తి గల్లంతు

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

చేజర్ల: కండలేరు జలాశయంలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. కొల్లపనాయుడుపల్లి దళితవాడకు చెందిన కొమ్మల శివకోటయ్య గ్రామ సమీపంలో కండలేరు జలాశయంలో చేపల వేటకు సహచరులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. సహచర కాలనీవాసులు కోటయ్యను కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో శివకోటయ్య కోసం గాలిస్తున్నారు. వృత్తిరీత్యా కోటయ్య డ్రైవర్‌. వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.60

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement