నెల్లూరు(పొగతోట): ‘మర్రిపాడు మండలంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించాలి. ప్రమదాలు జరుగుతున్నాయి. బస్సులు కూడా రావడం లేదు. రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో సభ్యులు వివిధ సమస్యలను వెల్లడించారు. ఏఎస్‌పేట ఎంపీపీ బోయళ్ల పద్మజారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. శ్రీకొలనులో హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తై రెండు సంవత్సరాలవుతుందని, త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంగం – కలిగిరి రోడ్డు అధ్వానంగా ఉందని ఎంపీపీ తెలిపారు. ఇంకా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని సభ్యులు సభ దృష్టి తెచ్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే దరఖాస్తులు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, బిల్లులు చెల్లించలేదని మంత్రుల దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు. నాడు – నేడు పనులు మధ్యలో నిలిచిపోయాయన్నారు.
● పంచాయతీరాజ్ ఎస్‌ఈ కోటేశ్వర్రావు ప్రగతి నివేదిక చదువుతుండగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలుగజేసుకుని సమావేశాలు ఎప్పడు పెట్టినా ఆవు కథలా పుస్తకంలో ఉండేది చదువుకుంటూ పోవడమేనా, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా అని అసహనం వ్యక్తం చేశారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా మంత్రి నారాయణ మాట్లాడారు.
● ఆనం అరుణమ్మ మాట్లాడుతూ సభ్యులు చెప్పిన సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
● కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రఽశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు సరైన సౌకర్యాల్లేక విద్యాద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో చెప్పిన
మర్రిపాడు జెడ్పీటీసీ
ఎప్పుడూ ఆవు కథ చదువుకుంటూ
పోవడమేనా?
ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా?
పీఆర్ ఎస్‌ఈపై మంత్రి ఆనం అసహనం


