● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
కొండాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు, దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఉదయగిరిలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం గానుగపెంట పంచాయతీలో దళితుడైన జడ రసూల్‌ను దారుణంగా హత్య చేసి బావిలో పడవేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజలు తగిన సమయంలో తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ తరఫున పోరాటం చేసి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండాపురం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఇర్మియా, నాయకులు ఎడ్లపల్లి వెంకటరామయ్య, చేజర్ల సుబ్బారెడ్డి, అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.


