నెల్లూరు సిటీ: కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామంటూ హామీలిచ్చారని, నేడు అధికారంలోకి వచ్చి తగ్గించకుండా చంద్రబాబు, లోకేశ్ మోసాలు చేస్తున్నారంటూ ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అధిక ధరలకు వీరే కారణమన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడే అత్యధిక ధర ఉందన్నారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. వినూత్నమైన నిరసన నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.


