పనుల నిమిత్తం ఎండలో తిరిగేవారికి కాస్తంత సమయం దొరికితే చాలు నీడలో సేదతీరి హమ్మయ్య అనుకుంటారు. మూగజీవాల పరిస్థితి అలా కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అవి పడుతున్న బాధలు వర్ణనాతీతం. చిల్లకూరు మండలం తీర ప్రాంతంలోని కాకువారిపాళెం సమీపంలోని సిలికా భూమిలో ఉన్న వేపచెట్టు కింద శుక్రవారం సుమారు వంద జీవాలు చేరాయి. గ్రామానికి చుట్టుపక్కల ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పెంపకందారులు ఆ భూములకు అటువైపుగా ఉండే పడవ భూముల (వరినాటే భూములు) వద్దకు జీవాలను మేతకు తీసుకెళ్తుంటారు. అయితే మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాటిని ఆ భూమిలో ఉన్న వేపచెట్టు కిందకు చేరుస్తుంటారు. ఆకలి సంగతి దేవుడెరుగు.. ముందు నీడలో సేద తీరుతాం అన్నట్టుగా ఉంటాయి ఆ మూగజీవాలు. – చిల్లకూరు
చెట్టు కింద సేద తీరుతున్న జీవాలు


