ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి నీదే | - | Sakshi
Sakshi News home page

ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి నీదే

Feb 18 2026 6:56 AM | Updated on Feb 18 2026 6:56 AM

ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి నీదే

ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి నీదే

రూప్‌కుమార్‌పై గిరిజన నేత

జయవర్ధన్‌ విమర్శలు

నెల్లూరు(బారకాసు): ‘మా ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని, ప్యాకేజీలు ఇస్తున్నారని విమర్శలు చేయడం సరికాదు. ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి రూప్‌కుమార్‌ యాదవ్‌కు మాత్రమే ఉంది’ అని గిరిజన నేత తలపల జయవర్ధన్‌ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ మేయర్‌ ఎన్నిక విషయంలో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని స్పందించి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట పలువురు గిరిజన నేతలు అంబేడ్కర్‌, వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయవర్దన్‌ మీడియాతో మాట్లాడారు. మాజీ మేయర్‌ పొట్లూరి స్రవంతి విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. దీనిని సవరించుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించిన స్థానంలో వేరే వర్గానికి అవకాశం కల్పించడం బాధాకరమన్నారు. ఇలాంటి పొరపాట్లతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సంఘాల నేతలు బాపట్ల వెంకటపతి యానాది, భక్తుల లక్ష్మణ శేఖర్‌, చౌటురి శ్రీనివాసులు, ఏడుకొండలు, కందల రమేష్‌, ఏకశిర మురళి, సురేంద్ర, ఏకుల సుధీర్‌, చేవూరు శ్రీనివాసులు, శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement