వైభవంగా నృసింహుని కల్యాణం
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగి సేవ జరిపారు. 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లను తిరుచ్చిలో సహస్ర దీపాలంకరణతో మండపంలోకి తీసుకొచ్చి ఊంజల్‌సేవ నిర్వహించారు.
నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం
ఆలయ నిత్యాన్నదాన పథకానికి రాపూరు మండలం సిద్ధవరానికి చెందిన ఏటూరి బ్రహ్మారెడ్డి–జయశ్రీ దంపతులు రూ.1,00,116లను అందించినట్లు ఏసీ శ్రీనివాసులు తెలిపారు.
వైభవంగా నృసింహుని కల్యాణం


