లారీని ఢీకొన్న బైక్
● యువకుడికి గాయాలు
కొడవలూరు: రోడ్డు మలుపు వద్ద ముందు వెళ్తున్న లారీని మోటార్ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెం మీనమ్మగుంట వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. నార్తురాజుపాళెం నుంచి గండవరం వెళ్లే రోడ్డుపై మీనమ్మగుంట వద్ద మలుపు ఉంది. విడవలూరు మండలం దంపూరుకు చెందిన వాసు బైక్‌పై అదే మలుపు వద్ద తిరిగే క్రమంలో లారీని ఢీకొని రోడ్డు పక్కన పడిపోయారు. రోడ్డు పక్కన పడిన వాసుకు సర్వీ సు రోడ్డుకున్న డివైడర్ వాల్ తగిలి ముఖంపై బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.
లారీ కిందకు వెళ్లిన బైక్
గాయపడిన వాసు
లారీని ఢీకొన్న బైక్


