
రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం
● ఆటో బోల్తా
● ముగ్గురికి గాయాలు
సోమశిల: చేజర్ల మండల పరిధిలోని పడమటికండ్రిక వద్ద ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. బుజబుజనెల్లూరుకు చెందిన ఓ కుటుంబం దాచూరులోని నాగార్పమ్మ ఆలయానికి ఆటోలో బయలుదేరింది. పడమటికండ్రిక గ్రామానికి సమీపంలో రోడ్డు కుంగిపోవడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోడ్డు కుంగిపోవడంతో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం