
యువకుడి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న మహిళలు
పొదలకూరు: ఏడేళ్లుగా ప్రేమ పేరుతో వంచించి అన్నివిధాలుగా వాడుకుని తీరా వివాహం చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన పొదలకూరు మండలం నేదురుమల్లి ఎస్సీకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన కాకి సోనియా, నేదురుమల్లికి చెందిన సాగర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తనను వివాహం చేసుకోమని సాగర్‌ను సోనియా గట్టిగా పట్టుపట్టడంతో ముఖం చాటేశాడు. దీంతో ఆమె దిశ ప్రొటక్షన్ చైర్మన్ అరుణ, కమిటీ సభ్యులు, మహిళా సంఘాలను ఆశ్రయించారు. వారితో కలిసి సాగర్ ఇంటి వద్దకు వెళ్లి ధర్నాకు దిగారు. అయితే యువకుడితోపాటు వారి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో మహిళా సంఘాల వారు సోనియాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment