నమ్మండి.. నాణ్యత ఇలా ఉంటుంది..!
● నిర్మించిన మూడు రోజులకే
ధ్వంసమైన రోడ్డు
చిట్టమూరు: రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించి తమ జేబులు నింపుకొనేందుకే టీడీపీ ప్రభుత్వం పరిమితమవుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్లు రోజుల వ్యవధిలోనే ధ్వంసమవుతున్నాయి. సూళ్లూరుపేట – కోట.. మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం తాడిమేడు నుంచి సింగనాల్తూరు వరకు వేస్తున్న తారు రోడ్డు పనులు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలాయి. మూడు రోజుల క్రితమే ఈ పనులను పూర్తి చేయగా, గురువారానికి ఇవి ధ్వంసమై దర్శనమిచ్చాయి. గుంతల్లో నాసిరక మెటల్‌ను పరిచి తారు వేస్తుంటే, మరుసటి రోజుకే అది లేచిపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నమ్మండి.. నాణ్యత ఇలా ఉంటుంది..!


