తూపిలిపాళేనికి చేరుకున్న సైక్లథాన్
వాకాడు: వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ చేపట్టిన సైక్లథాన్ మండలంలోని తూపిలిపాళేనికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారుల భద్రతపై స్థానిక మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోల్‌కతా నుంచి కేరళలోని కొచ్చి వరకు సైకిల్ యాత్ర సాగనుందని అధికారులు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో విద్యా సదుపాయాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆరాతీశారు. వాలమేడు హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఫిష్కాన్ డైరెక్టర్ అప్పంగారి జయపాల్, కాపులు పామంజి గోవిందయ్య, వావిల సుబ్రహ్మణ్యం, మత్స్యకారులు కొండూరు వెంకటేశ్వర్లు, గోవిందయ్య, మస్తానయ్య, గోవిందు, బ్రహ్మయ్య, రఘు, యేసు తదితరులు పాల్గొన్నారు.


