
అమెరికాలోని యుజీన్ వేదికగా జరగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 16.68 మీటర్ల దూకి ఎల్డోస్ పాల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. తద్వారా ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ట్రిపుల్ జంప్ విబాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా ఎల్డోస్ పాల్ చరిత్ర సృష్టించాడు.
ఇక ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. ఇక ఆదివారం జరగనున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎల్డోస్ పాల్ తలపడనున్నాడు. మరో వైపు శుక్రవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా,రోహిత్ యాదవ్ ఫైనల్‌కు చేరుకున్నారు.
చదవండి:World Athletics Championships 2022:. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా