విండీస్‌ క్రికెటర్‌ వింత ప్రవర్తన.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌ | Womens WC 2022: Afy Fletcher celebrates wicket with heartwhelming gesture for seven-month-old son | Sakshi
Sakshi News home page

Womens WC 2022 WI vs BAN: విండీస్‌ క్రికెటర్‌ వింత ప్రవర్తన.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌

Mar 18 2022 12:51 PM | Updated on Mar 18 2022 2:44 PM

Womens WC 2022: Afy Fletcher celebrates wicket with heartwhelming gesture for seven-month-old son - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కాగా మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్‌ అఫీ ఫ్లెచర్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు కీలక వికెట్లు తీసిన ఫ్లెచర్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. కాగా ఈ విషయం పక్కనబెడితే.. ఫ్లెచర్‌ ఫ్లెచర్‌ వన్డే ప్రపంచకప్‌ కోసం తన ఏడు నెలల కొడుకుని వదిలివచ్చింది. ఈ సందర్భంగా తన చిన్నారిని గుర్తుచేసుకుంటూ సూపర్‌ సెలబ్రేషన్‌తో మెరిసింది.

బంగ్లా బ్యాటర్‌ ఫర్గానా హోక్యూ వికెట్‌ తీసిన తర్వాత ఫ్లెచర్‌.. తన చేతిని ఫోన్‌గా మార్చి నెంబర్‌ డయల్‌ చేసి కొడుకుతో మాట్లాడినట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. హాయ్‌ బేబీ.. హౌ ఆర్‌ యూ మై చైల్డ్‌ అంటూ నవ్వడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెచర్‌ కంటే ముందే పాకిస్తాన్‌ మహిళా ప్లేయర్‌ బిస్మా మరూఫ్‌ క్రాడిల్‌ రాకింగ్‌ సెలబ్రేషన్‌తో మెరిసింది. 

ఇక ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ వుమెన్స్‌ నాలుగు పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ వుమెన్స్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కీపర్‌ క్యాంప్‌బెల్‌ 53 పరుగులతో టాప్‌స్కోరర్‌ కాగా.. హేలీ మాథ్యూస్‌ 18, అఫీ ఫ్లెచర్‌ 17 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ వుమెన్స్‌ 49.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్‌ అయింది. నిగర్‌ సుల్తానా 25, నదియా కేర్‌ 25 నాటౌట్‌, సల్మాన్‌ కాతున్‌ 23 పరుగులు చేశారు. విండీస్‌ వుమెన్స్‌ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ 4, అఫీ ఫ్లెచర్‌ 3, స్టిఫానీ టేలర్‌ 3 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement