‘ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడానికే వచ్చాం’

We Are Here To Win The IPL, Ponting - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి పాలైంది. లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్‌-1లో కూడా ముంబై ఇండియన్స్‌ చేతిలో ఢిల్లీ ఓడింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఫైనల్‌లో తమ కుర్రాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారని హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. ఈ సీజన్‌ను అత్యుత్తమంగా ముగించే సత్తా ఢిల్లీకి ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి ప్రిమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంటింగ్‌..‘నేను చాలా భారీ అంచనాలతో యూఏఈకి వచ్చా. (‘ఏంటిది కోహ్లి.. ధోనిలా ఆలోచించలేవా?!’)

మా జట్టు కచ్చితంగా బెస్ట్‌ జట్టే. సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. కానీ సెకండ్‌ లెగ్‌లో మేము కాస్త వెనుకబడ్డాం. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచాం. ఫైనల్‌లో కూడా మేము ఏమిటో చూపిస్తాం. మాకు ఇదొక మంచి సీజన్‌. మేము ఇప్పటికీ గెలవలేదు. అదే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మేము టైటిల్‌ గెలవడం కోసమే ఇక్కడ ఉన్నాం’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం తమను తీవ్ర నిరాశలోకి నెట్టిందన్నాడు. కాగా, ఆ తర్వాత పుంజుకోవడం తమ జట్టులో ఉన్న టాలెంట్‌కు నిదర్శనమన్నాడు. కొంతమందికి సరైన అవకాశాలు కూడా ఇవ్వలేకపోయామని, వారికి నిరాశ అనేది ఉంటుందన్నాడు. బెస్ట్‌ ఎలెవన్‌ అనేది చూసే జట్టును పోరుకు సిద్ధం చేస్తున్నామన్నాడు. తమ అత్యుత్తమ క్రికెట్‌ ఇంకా రావాల్సి ఉందని పాంటింగ్‌ అన్నాడు. అది ఫైనల్‌ మ్యాచ్‌ ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నానన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top