ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌ | Virat Kohli Withdraws From First Two England Tests For Personal Reasons | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌

Jan 22 2024 3:36 PM | Updated on Jan 24 2024 1:14 PM

Virat Kohli Withdraws From First Two England Tests For Personal Reasons - Sakshi

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని బీసీసీఐ ఇవాళ (జనవరి 22) ప్రకటించింది. తాను అందుబాటులో ఉండలేకపోతున్నానన్న విషయాన్ని కోహ్లి.. మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కూడా చెప్పాడని బీసీసీఐ మీడియాతో చెప్పింది. 

దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని ఎల్లప్పుడూ ప్రధాన కర్తవ్యంగా భావించే కోహ్లి లాంటి ఆటగాడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్ని జట్టు నుంచి రిలీజ్‌ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. కోహ్లి నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీసీసీఐ కోరింది. కోహ్లికి ప్రత్యామ్నాయ ఆటగాడిని తర్వలోనే ఎంపిక చేస్తామని ప్రెస్‌ రిలీజ్‌లో పేర్కొంది. 

కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జనవరి 25 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇదివరకే హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

ఇంగ్లండ్‌ జట్టులో సైతం హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాల చేత ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌ (ఫిబ్రవరి 2-) విశాఖ వేదికగా, మూడో మ్యాచ్‌ (ఫిబ్రవరి 15-19) రాజ్‌కోట్‌ వేదికగా, నాలుగో మ్యాచ్‌ (ఫిబ్రవరి 23-27) రాంచీలో, ఐదో టెస్ట్‌ (మార్చి 7-11) ధర్మశాల వేదికగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌ మొత్తానికి ఇంగ్లండ్‌ జట్టును ఇదివరకే ప్రకటించగా.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. 

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: జాక్‌ క్రాలే (కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, డాన్‌ లారెన్స్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ ఫోక్స్‌, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, టామ్‌ హార్ట్లీ, జాక్‌ లీచ్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement