Ultimate Kho Kho: తెలుగు యోధాస్‌ శుభారంభం | Ultimate Kho Kho: Telugu Yoddhas beat Chennai Quick Guns | Sakshi
Sakshi News home page

Ultimate Kho Kho: తెలుగు యోధాస్‌ శుభారంభం

Aug 15 2022 6:38 AM | Updated on Aug 15 2022 6:38 AM

Ultimate Kho Kho: Telugu Yoddhas beat Chennai Quick Guns - Sakshi

పుణే: అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు విజయంతో బోణీ చేసింది. ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు యోధాస్‌ 48–38తో చెన్నై క్విక్‌ గన్స్‌ జట్టుపై విజయం సాధించింది. డిఫెండర్‌ దీపక్‌ మాధవ్, అటాకర్‌ అరుణ్‌ గున్కీ రాణించి తెలుగు యోధాస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

ఆరంభంలో తెలుగు యోధాస్‌ వరుసగా 25 పాయింట్లు స్కోరు చేయగా చెన్నై ఖాతా తెరువలేకపోయింది. తెలుగు యోధాస్‌ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్‌ పాయింట్లు, 17 డైవ్‌ పాయింట్లు ఉండటం విశేషం. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 69–44తో ముంబై ఖిలాడీస్‌ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ వారియర్స్‌తో ముంబై ఖిలాడీస్‌; ఒడిషా జగర్‌నాట్స్‌తో చెన్నై క్విక్‌ గన్స్‌ తలపడతాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement