breaking news
Attacker
-
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
Ultimate Kho Kho: తెలుగు యోధాస్ శుభారంభం
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు విజయంతో బోణీ చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 48–38తో చెన్నై క్విక్ గన్స్ జట్టుపై విజయం సాధించింది. డిఫెండర్ దీపక్ మాధవ్, అటాకర్ అరుణ్ గున్కీ రాణించి తెలుగు యోధాస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆరంభంలో తెలుగు యోధాస్ వరుసగా 25 పాయింట్లు స్కోరు చేయగా చెన్నై ఖాతా తెరువలేకపోయింది. తెలుగు యోధాస్ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్ పాయింట్లు, 17 డైవ్ పాయింట్లు ఉండటం విశేషం. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 69–44తో ముంబై ఖిలాడీస్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్తాన్ వారియర్స్‌తో ముంబై ఖిలాడీస్; ఒడిషా జగర్‌నాట్స్‌తో చెన్నై క్విక్ గన్స్ తలపడతాయి. -
మళ్లీ వణికిన అమెరికా!
వాషింగ్టన్: న్యూయార్క్ ఘటనను మరువక ముందే.. కొలరాడో రాష్ట్రంలో జరిగిన దుశ్చర్య అమెరికాను మరోసారి వణికించింది. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్ నగర శివార్లలోని వాల్‌మార్ట్‌లోకి బుధవారం రాత్రి 7.30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. లోపలకు ప్రవేశిస్తూనే హ్యాండ్‌గన్‌తో విచ్చక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. దీంతో కౌంటర్ సమీపంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందారు. కాల్పులు జరిపిన అనంతరం సాయుధుడు కారులో పారిపోయాడని అమెరికా మీడియా పేర్కొంది. ఒకవైపు కాల్పులు జరుగుతుండగానే.. పోలీసులు వాల్‌మార్ట్‌లోకి ప్రవేశించి లోపలున్న వారిని ప్రాణాలతో బయటకు తెచ్చారు. అయితే.. ఆ ‘మొదటిసారి కాల్పుల శబ్దం వినబడగానే సూపర్ మార్కెట్లోని వారంతా గేట్ల వద్దకు పరుగులు తీశారు. ఉద్యోగులు, వినియోగదారులు అరుస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు దాక్కున్నారు’ అని అరోన్ స్టీఫెన్స్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. నిందితుడి గుర్తింపు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని స్కాట్ ఓస్ట్రీమ్ (47)గా గుర్తించారు. ఘటన జరిగిన 14 గంటల తర్వాత డెన్వర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. -
ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ..
నీస్: ఫ్రాన్స్‌లో ట్రక్కుతో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది మహమ్మద్ లహోయిజ్ బహులల్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84 మంది మృతికి కారణమైన బహులల్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో బహులల్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే అతడు చాలా అనతికాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని అధికారులు గుర్తించారు. -
'నీ బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్..'
జార్జియా: తన గోతిలో తానే పడ్డట్లు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి తనంతట తాను పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. లైంగికదాడికి పాల్పడే క్రమంలో బాధితురాలిని ఆమె బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్ అంటూ బెదిరించి దొరికిపోయాడు. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ కాకుండా పోలీసుల అత్యవసర ఫోన్ నెంబర్ 911కు చేయడంతో వారు వచ్చి ఆమెను రక్షించారు. అతడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే క్లేటాన్ అనే రాష్ట్రంలో రాబర్డ్ గిల్స్(27) అనే వ్యక్తి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి అతడి స్పందన ఎలా ఉంటుందో వినాలని అనుకున్నాడు. అనుకుందే తడవుగా ఫోన్ చేయ్ అతడికి ఫోన్ చేయ్ అంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి తెలివిగా వ్యవహరించి పోలీసుల ఫోన్ నెంబర్ 911కు చేసింది. దీంతో వెంటనే పోలీసులు స్పందించి ఘటన జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిపై ఎలాంటి దాడి జరగకుండా అడ్డుకోగలిగారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని వేగంగా స్పందించడమే కాకుండా పోలీసులను పంపించేవరకు ఫోన్ ఆపరేటర్ చూపిన చొరవకు అంతా ముగ్దులైపోయారు.