
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు భారత్‌కు శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే తొలి సారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టిన రోహిత్ శర్మ భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ పెవిలయన్‌కు చేరాడు. కాగా భారత ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన లాహిరు కుమార బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించిన రోహిత్.. లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే కొన్నాళ్లుగా షార్ట్-పిచ్ డెలివరీలకు రోహిత్ పుల్ షాట్ అద్భుతంగా ఆడుతున్నాడు.
అదే విధంగా రోహిత్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాగా కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి టెస్ట్ కావడం, తక్కువ పరుగులకే ఔట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోను రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ బ్యాటింగ్‌పై ట్విటర్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరగుతుంది. రోహిత్ కెప్టెన్సీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడని, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం లేదని అభిమానులు వాపోతున్నారు. ఇక మరి కొంత మంది రోహిత్ ఔటైన తీరుపై కూడా ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: IPL 2022 CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..!
Pull Shot @ImRo45 💔#RohitSharma #Rohitions45 #INDvSL pic.twitter.com/ZtnQUioxjI
— Rohit Sharma(Fan Page) (@rohitions45) March 4, 2022