మరో రెండు ఈవెంట్స్‌ నుంచి వైదొలిగిన సిమోన్‌ బైల్స్‌

Tokyo Olympics gymnast Simone Biles withdraws from two more events - Sakshi

మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా మహిళా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌లో తన మెరుపు విన్యాసాన్ని పరిమిత ఈవెంట్లలోనే ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. వాల్ట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన ఆమె... ఆ ఈవెంట్‌తో పాటు అన్‌ఈవెన్‌ బార్స్‌ నుంచి కూడా తప్పుకుంది. ఆదివారం ఈ రెండు ఈవెంట్లకు సంబంధించిన ఫైనల్‌ పోటీలు జరుగుతాయి. అయితే బ్యాలెన్స్‌ బీమ్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్లలో పాల్గొనే అవకాశముంది. ఈ రెండు ఈవెంట్లకు మరింత సమయం ఉండటంతో ఆలోపు మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆమె భావిస్తోంది. మంగళవారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌ నుంచి
ఈ 24 ఏళ్ల ఒలింపిక్‌ చాంపియన్‌ బైల్స్‌ అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top