Tokyo Olympics 2020: నీరజ్ చోప్రాకు స్వర్ణం

Tokyo Olympics Day 16 August 7 Updates And Highlights Telugu - Sakshi

►నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడ‌ల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా సూప‌ర్ షో క‌న‌బ‌రిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్య‌ధికంగా 87.58 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని అందించి ఇండియాకు చిరస్మ‌ర‌ణీయ రోజును మిగిల్చాడు. తాజాగా నీరజ్‌ చోప్రా పతకంతో భారత్‌ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో 47వ స్థానంలో నిలిచి ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ను ముగించింది. అంతేగాక 2012 లండన్‌ ఒలింపిక్స్‌(ఆరు పతకాలు) తర్వాత ఏడు పతకాలతో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.

తొలి ప్ర‌య‌త్నంలో అత‌ను 87.03 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అత‌ను మ‌రింత ప‌దునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో ఫ‌స్ట్ త్రోతోనే అంద‌రికీ షాకిచ్చాడు నీర‌జ్‌. అత‌ని ప‌ర్స‌న‌ల్ బెస్ట్ 88.07 మీట‌ర్లు. దానికి త‌గిన‌ట్లే నీర‌జ్ టోక్యోలో త‌న ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవ‌రేట్‌గా ఉన్న నీర‌జ్‌.. అనుకున్న‌ట్లే ఇండియాకు ఓ స్వ‌ర్ణాన్ని అందించాడు.

ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. నాలుగ, ఐదు రౌండ్లలో త్రో వేయడంలో విఫలమైనప్పటికీ ఓవరాల్‌గా ఇప్పటికీ నీరజ్‌ చోప్రా టాప్‌లోనే కొనసాగుతున్నాడు.

మూడో రౌండ్‌లో 76.79 మీటర్లు విసిరినప్పటికి ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా ఆరు రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది.

► టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రౌండ్‌లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్‌ 1లో నిలిచాడు. తొలి రౌండ్‌లో 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... సెకండ్‌ రౌండ్‌లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

►టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ భ‌జ‌రంగ్ బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకున్నాడు. కాంస్య ప‌త‌కం కోసం సాగిన మ్యాచ్‌లో భ‌జ‌రంగ్ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి 8-0 తేడాతో మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కాంస్య పతకం కోసం జ‌రిగిన మ్యాచ్‌లో క‌జ‌క‌స్తాన్‌కు చెందిన దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌తో ఇండియ‌న్ స్టార్ రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థిని ఓ పట్టు పట్టి కాంస్యాన్ని సాధించాడు. 

Golf: Women's Tournament Final: టోక్యో ఒలింపిక్స్‌ 2020 గోల్ప్ మహిళా విభాగం తుది మ్యాచ్‌ రసవత్తరంగా ముగిసింది. అదితి అశోక్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత ఖాతాలో పతకం పడకపోయినా.. ఫైనల్‌లో గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది అదితి అశోక్‌. నెల్లీ కోర్డా స్వర్ణం కన్ఫర్మ్‌ చేసుకోగా, జపాన్‌ ఇనామీ, న్యూజిలాండ్‌ లడియా కో రెండో ప్లేసులో సంయుక్తంగా నిలిచి.. రజత, కాంస్యాలు అందుకున్నారు. 

చివర్లో పతకంకు అవకాశాలకు కేవలం రెండు హోల్స్‌ ఉన్న సమయంలో.. వర్షంతో మ్యాచ్‌ నిలిపి వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాసేపటికి తిరిగి ఆట మొదలైంది. వర్షం తర్వాత మొదటి ప్లేస్‌లో నెల్లీ కోర్డా, ఇనామీ లు లీడ్‌లో నిలవడం విశేషం. తర్వాతి ప్లేస్‌లో లిడియా(ఎల్‌) కో నిలిచింది.  వర్షం తెరిపి ఇచ్చాక మొదలైన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో తర్వాతి హోల్‌లో నాలుగో పొజిషన్‌కి పడిపోయింది అదితి. ఆపై ఒక్క షాట్‌ తేడాతో కాంస్యం తృటిలో చేజార్చుకుంది అతిధి. ఏది ఏమైనా 200 వ ర్యాంకర్‌ అయిన ఈ భారత్‌ యువ గోల్ఫర్‌ ఓవరాల్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.


Tokyo Olympics 2020 Live Updates:
►పోరాడిన ఓడిన భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌
► నెల్లీ కోర్డాకు స్వర్ణం
► లిడియాకు రజతం అవకాశం
► లిడియా కో-అతిది మధ్య కాంస్యం కోసం ఫైనల్‌ హోల్‌ షాట్‌ 
► హోల్‌కి దగ్గర్లో పడిన అతిది షాట్‌
► ఇనామీ మెడల్‌ గ్యారెంటీ
► ఆరో స్థానంలో  పెడెర్‌సన్‌ క్లోజ్‌
► ఆట మొదలు.. నాలుగో స్థానానికి పడిపోయిన అదితి.. మిగిలింది ఒకే హోల్‌
► ఆట రద్దా? కొనసాగింపా? మిగిలినవి రెండే హోల్స్‌. పతకంపై గందరగోళం.. ఒలింపిక్‌ కమిటీ నుంచి రావాల్సిన స్పష్టత

► వాతావరణం కారణంగా ఒకవేళ మ్యాచ్‌ ఇవాళ కొనసాగే అవకాశం. లేకుంటే.. రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపు కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటే శుక్రవారం నాటి ఫలితం ఆధారంగా మెడల్స్‌ ఇస్తారా? అనేది ఒలింపిక్‌ కమిటీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 
► ప్రారంభమైన వర్షం.. మ్యాచ్‌ నిలిపివేత
► వాతావరణంలో మార్పులు.. మ్యాచ్‌ నిలిపివేత?
► చివర్లో మారుతున్న సమీకరణాలు.. మళ్లీ మూడో పొజిషన్‌కు అతిది!
► పుంజుకుంటున్న ప్రత్యర్థులు
► అదితి అశోక్‌.. మరో మూడు హోల్స్‌ మాత్రమే

► ఛాన్స్‌ చేజార్చుకున్న అదితి.. నాలుగో స్థానానికి
► గోల్డ్‌ ఆశలు సజీవం?!
► ప్రత్యర్థి నెగెటివ్‌ పాయింట్ల మీదే ఆధారపడ్డ Aditi Ashok పతకం
► మరో నాలుగు బంతులు.. రెండు పాయింట్ల తేడా మాత్రమే!
► ఆఖరికి చేరుకున్న ఫైనల్‌.. మరింత పెరిగిన ఉత్కంఠ.
► అనూహ్యంగా రెండో స్థానానికి అదితి


► ఆఖరుకు చేరుకున్న ఆట.. మూడో స్థానంలో అదితి!
► ఒలింపిక్స్‌ చరిత్రలో మహిళా గోల్ఫ్‌ ఫైనల్‌లో రెండో స్థానంలో నలుగురి పోటీ-అందులో అతిది ఒకరు.
► అదితిపై పెరుగుతున్న ఒత్తిడి.. మూడో స్థానం
► ఎమిలీ, లైడాతో రెండో స్థానంలో టైలో నిలిచింది అతిది.
► నాలుగో రౌండ్‌ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది.

►ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 23 ఏళ్ల అదితి.. ఒకానొక దశలో అగ్ర స్థానంలోకి దూసుకొచ్చింది.

► అదితి అశోక్‌, నీరజ్‌ చోప్రా, బజరంగ్‌ పూనియా మీదే భారత్‌ ఆశలు

క్లిక్‌ చేయండి: త్వరపడండి.. క్యాష్‌ ప్రైజ్‌ గెల్వండి

ఇవాళ్టి షెడ్యూల్‌
టోక్యో ఒలింపిక్స్‌లో నేడు భారత్‌కు కీలక మ్యాచ్‌లు
రెజ్లింగ్‌ పురుషుల 65 కిలోల విభాగంలో కాంస్యం కోసం పోరు
కాంస్యం కోసం తలపడనున్న బజ్‌రంగ్‌ పునియా
పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌లో బరిలోకి నీరజ్‌ చోప్రా
తొలిసారి ఒలింపిక్స్‌ ఆడుతున్న నీరజ్ చోప్రా
ఫైనల్‌లో నీరజ్ చోప్రా గెలిస్తే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top