నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్‌ సూర్యవంశీ | There is pressure These are my learnings: Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్‌ సూర్యవంశీ

Jun 1 2026 2:13 PM | Updated on Jun 1 2026 2:21 PM

There is pressure These are my learnings: Vaibhav Sooryavanshi

భారత యువ సంచలనం, రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.

గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్‌కప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఆరెంజ్‌ క్యాప్‌ విజేత
ఇక ఐపీఎల్‌-2026లో పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్‌ ఓపెనర్‌గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్‌ ప్లేయర్‌, మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.

ఈ క్రమంలో ప్రజెంటర్‌, టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.

నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను
వచ్చే సీజన్‌లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్‌.. మ్యాచ్‌కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్‌లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.

ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్‌నెస్‌ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్‌ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్‌గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్‌ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. 

చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement