T20 WC 2021: సెమీస్‌ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి

T20 World Cup 2021: India Still Semi Final Chance Check Possible Scenarios - Sakshi

India Still Have Semi-Final Chance T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి ఎట్టకేలకు భోణీ కొట్టింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకున్న టీమిండియా నెట్‌రన్‌రేట్‌ను మైనస్‌ నుంచి ప్లస్‌కు తీసుకొచ్చింది. అయితే రన్‌రేట్‌ విషయంలో ఇప్పటికీ న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌ల కంటే వెనుకబడి ఉంది. టీమిండియాకు సెమీస్‌ చేరడం కష్టమే అయినప్పటికీ మొత్తం దారులైతే మూసుకుపోలేదు. నవంబరు 5న దుబాయ్‌ వేదికగా టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో ఆ అవకాశాలన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికైతే గ్రూఫ్‌-1 నుంచి ఇంగ్లండ్‌, గ్రూఫ్‌-2 పాకిస్తాన్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన 3,4 స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. 

చదవండి: T20 WC 2021 IND Vs AFG: ఎట్టకేలకు గెలిచాం.. ఆపై నిలిచాం

► టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి +0.073 రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ +.0.816.. అఫ్గానిస్తాన్‌ రన్‌రేట్‌ +3.097 నుంచి +1.481 పడిపోయింది. 

► టీమిండియా సెమీఫైనల్‌​కు వెళ్లాలంటే స్కాట్లాండ్‌, నమీబియాలతో జరగనున్న మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి.అంతేకాదు అఫ్గానిస్తాన్‌ లేదా నమీబియాతో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోవాలని కోరుకోవాలి. ప్రాక్టికల్‌గా చూస్తే ఇది సాధ్యం కాకపోవచ్చు.. ఒకవేళ అఫ్గానిస్తాన్‌ గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండొచ్చు.

► న్యూజిలాండ్‌ అఫ్గానిస్తాన్‌తో పాటు నమీబియాపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌కు చేరుతుంది. టీమిండియా, అఫ్గానిస్తాన్‌లు ఇంటిబాట పడతాయి.

► న్యూజిలాండ్‌ అఫ్గానిస్తాన్‌తో ఓడి.. నమీబియాతో గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. ఇక టీమిండియా మిగిలిన  రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే 6 పాయింట్లు లభిస్తాయి. అదే సమయంలో అఫ్గానిస్తాన్‌ కూడా ఆరు పాయింట్లతోనే ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. ఆ పరిస్థితి వస్తే టీమిండియా రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే మాత్రం కచ్చితంగా సెమీస్‌కు చేరుతుంది.

చదవండి: NZ Vs SCO: 4, 4, 4, 4, 4, 0.. టి20 ప్రపంచకప్‌ చరిత్రలో రెండోసారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top