వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు! | Suyash Prabhudessai Likely Replaced Virat Kohli: Reports | Sakshi
Sakshi News home page

IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు!

Jan 23 2024 7:55 AM | Updated on Jan 23 2024 8:57 AM

Suyash prabhudessai Likely replaced virat kohli: Reports - Sakshi

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు విరాట్‌ కోహ్లి రూపంలో ఊహించని షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. విరాట్‌ తిరిగి రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలో తొలి రెండు టెస్టులకు విరాట్‌ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సెలక్టర్లు పడ్డారు.  

దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న వెటరన్‌ గోవా యువ ఆటగాడు సుయాస్‌ ప్రభుదేశాయ్‌ పేరును సెలక్టర్లు పరిశీలీస్తున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ సీజన్‌-2024లో సుయాస్‌ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుయాస్‌ 386 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు ఉన్నాయి.

అంతేకాకుండా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ప్రభుదేశాయ్‌కు మంచి రికార్డు ఉంది. 29 మ్యాచ్‌ల్లో 47.97 సగటుతో 2015 పరుగులు చేశాడు. అయితే కోహ్లికి ప్రత్యామ్నాయంగా సుయాస్‌తో పాటు వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా, మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజిత్‌ పాటిదార్‌ పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం ప్రభుదేశాయ్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారం‍భం కానుంది.
చదవండితొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement